పిల్లోడి సంగీత కచేరీ.. వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లోడి సంగీత కచేరీ.. వైరల్ వీడియో

October 19, 2020

పిల్లలు అల్లరి చేయడంలో, అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు వినడంలో ముందుంటారు. టీవీల్లో కార్టూన్లు చూస్తారు. అంతేగానీ బుద్దిగా కూర్చుని చెవులకు ఇంపైన సంగీతం వింటారా? వినలేరు సరికదా ఆ సంగీత వాయిద్యాన్ని విరగొట్టగలరు. అయితే ఓ బుడతడు మాత్రం తండ్రి పక్కన కూర్చుని చక్కగా హర్మోనియం సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదించడమే కాదు సంగీత సాధన కూడా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అతని వయసు మూడేళ్లే. సూరత్‌కు చెందిన తాన్హాజీ జాదవ్ తన కొడుకుతో ‘నాట్య సంగీత్’ను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్వీట్ చేశాడు. తన తండ్రిని అనుకరిస్తూ ఆ చిన్నోడు కూడా ఆలపించే ప్రయత్నం చేశాడు. 

ఈ వీడియో నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. ఈ వయసులో పిల్లోడిలో ఉన్న జిజ్ఞాసకు ఫిదా అవుతున్నారు. ఎన్నో కామెంట్లు చేస్తున్నారు.. లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘ఇది పర్‌ఫెక్ట్ కాంబినేషన్’ అని మరికొందరు అంటున్నారు. ‘పిల్లల్లో నేర్చుకునే అలవాటు ఉన్నవారు భవిష్యత్తులో పైకి వస్తాడు’ అని చెబుతున్నారు. ‘అద్భుతం, బ్యూటీఫుల్ పార్టనర్ షిప్’ అంటూ మరి కొందరు అంటున్నారు. ‘వీడు పెద్దయ్యాక గొప్ప సింగర్ అవుతాడు’ అంటూ మరొకరు అన్నారు.