ద్యావుడా.. ఇక వాట్సాప్‌లోనూ యాడ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. ఇక వాట్సాప్‌లోనూ యాడ్స్

January 6, 2020

Whatsapp

‘డబ్బులు ఊరికే రావు..’ అని హెచ్చించారే లలితా జ్యుయెలర్స్ అధినేత కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్ యాడ్ తెలిసిందే. డబ్బులే కాదు, డిజిటర్ సర్వీసులు కూడా అంతే. ఏదీ ఊరికే రాదు. యాడ్స్ లేని వీడియోను కానీ, ఫోటోను కానీ ఇకపై చూడలేమేమో. ఫేస్‌బుక్కుకే ఈ జబ్బు అంటుకుందంటే.. ఇప్పుడది ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌కూ పాకుతోంది. యాడ్ దర్శనం చేసుకున్నాకే ఇక వీడియోలు చూసే భాగ్యాన్ని ప్రసాదించే పనిలో పడింది. సరికొత్త ఫీచర్లతో తన వినియోగదారులను ఆకట్టుకున్న వాట్సాప్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది అన్నట్టు. 

ఈ ఏడాదిలో విడుదల చేసే ముఖ్యమైన ఫీచర్లలో ఒకటైన Status Ads ఫీచర్ ప్రేక్షకులకు అందబాటులోకి తీసుకురానుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయి. ఇటీవలే నెదార్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సమ్మిట్ (FMC) 2019లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. స్టేటస్‌లో యాడ్స్ డిస్‌ప్లే అవుతాయని, అడ్వర్టైజర్ పేరును యూజర్లు చూడొచ్చు అని తెలిపింది. అయితే ఈ స్టేటస్ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేదానిపై కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అతి త్వరలో అధికారిక లాంచింగ్ ఉండే అవకాశం ఉంది.