తెలంగాణలో ఎడ్‌సెట్ తేదీలు ఖరారు..కన్వీనర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఎడ్‌సెట్ తేదీలు ఖరారు..కన్వీనర్

April 4, 2022

bbdfb

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీఈడీ కోర్స్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ మాట్లాడుతూ..”ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 15 వరకు ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తుదారులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.450 చెల్లించాలి. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 19 రీజిన‌ల్ సెంట‌ర్లు, 55 ప‌రీక్ష కేంద్రాల‌తో ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తున్నాం” అని ఆయన తెలిపారు. పరీక్ష జులై 26,27 తేదీల్లో ఉంటుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ పరీక్షకు డిగ్రీ , ఇంజనీరింగ్‌లో 50 శాతం మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తుకు అర్హులని ప్రక‌టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ద‌ర‌ఖాస్తు దారుల‌కు 40 శాతం మార్కులు వ‌చ్చిన వారు అర్హులు అని వివ‌రించారు. తెలంగాణ వ్యాప్తంగా 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయనీ ఆయన స్పష్టం చేశారు.