జార్జిరెడ్డి వీడియో సాంగ్.. చిరంజీవి చేతుల మీదుగా..  - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి వీడియో సాంగ్.. చిరంజీవి చేతుల మీదుగా.. 

November 19, 2019

విప్లవ విద్యార్థి అనగానే చప్పున గుర్తొచ్చే పేరు జార్జిరెడ్డి. నేటి తరానికి అతణ్ని పరిచయం చేస్తూ తీసిన బయోపిక్ ‘జార్జిరెడ్డి’ చిత్రంపై అటు చిత్రసీమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.  దాదాపు 5 దశాబ్దాల కిందట జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అతడు విద్యార్థుల్లో రగిలించిన చైతన్యాన్ని కళ్లకు కడుతూ నిర్మించిన ఈ చిత్రంలోని ‘అడుగు అడుగు’ అనే వీడియో సాంగ్‌ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ పాట గురించి చిరంజీవి మాట్లాడుతూ..‘ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజల్లో తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నా. ఆ తర్వాత ఇన్నేళ్లకు జార్జిరెడ్డి సినిమా వల్ల ఆయన పేరు వింటున్నాను.ః  ఈ పాట చూసిన తర్వాత నేను చాలా ఉద్విగ్నానికి గురయ్యాను. అప్పట్లో నేను ఆయన గురించి విన్న విషయాలను ఈ పాట గుర్తుకు తెస్తోంది.  ఆయన ఆశయాలు, అన్యాయం జరిగితే ఆయన ఎలా స్పందించారో తెలిసింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. నేత తరం జార్జిరెడ్డితో కనెక్ట్ అవుతుందని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. చిత్ర బృందానికి ప్రత్యేకంగా నా అభినందనలు..’ అని చెప్పారు. కాగా అడుగు అడుగు పాటను రేవంత్ పాడాడు. మేఘరాజ్ రవీంద్ర రచించగా.. సురేష్ బొబ్బిలి బాణీలు సమకూర్చారు.

‘Hey rise up go getter go for it 

hey fighter 

నీలోనే ఉందిరా ప్రశ్నించే ఆ స్టామినా..’అని సాగుతుంది ఈ పాట.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా రైతులు, ఇతర బడుగుబలహీన వర్గాలకు న్యాయం కోసం జార్జిరెడ్డి పడిన తపనను పాటలో పరిచయం చేశారు. ఆనాటి రాజకీయాలను, ఆందోళనలను, విద్యార్థుల పోరాటాన్ని అద్భుతంగా చూపారు. ఇప్పటికే విడుదలైన జార్జి రెడ్డి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ నెల 22న చిత్రం విడుదల కానుంది.