వేలాది పోర్న్ సైట్లు బంద్.. రసికుల హాహాకారాలు - MicTv.in - Telugu News
mictv telugu

వేలాది పోర్న్ సైట్లు బంద్.. రసికుల హాహాకారాలు

October 24, 2018

శృంగార ప్రియులకు గుండెలు పగిలే చేదువార్త. మనదేశంలో ఈ రోజు ప్రధాన పోర్న్ వెబ్‌సైట్లు బంద్ అయ్యాయి. వేలాది సైట్లు తెరుచుకోవడం లేదు. పోర్న్‌హబ్, రెడ్ ట్యూబ్.. ఎక్స్ఎక్స్ బాపతు ప్రముఖ సైట్లు కాన్ట్ బి రీచ్డ్ అంటున్నాయి. పోర్న్ సైట్లపై నిషేధం విధించాలని కేంద్రం గతంలో విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వమే వీటిని బ్లాక్ చేసిందని భావిస్తున్నారు. అయితే చిన్నాచితకా సైట్లు యథావిధిగా  పనిచేస్తున్నాయి. దేశంలో అత్యాచారాల సంఖ్య పెరగడం వల్ల ప్రధాన సైట్లకు ఫైర్ వాల్స్‌తో అడ్డుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

Major porn site blocked in India no clarity from Government or internet service providers as recently officials tried to ban the sites despite protest  

నేపాల్, చైనా ప్రభుత్వాలు ఇటీవల వేలాది శృంగార సైట్లపై వేటువేశాయి. అత్యాచారాలు పెరుగడంతో దాదాపు 25వేల సైట్లను బ్లాక్ చేసింది. ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా అడల్ట్ సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధిపుల కేసును విచారిస్తూ.. ‘పోర్న్ సైట్లకు పగ్గాలు వేయకపోవడం వల్ల పిల్లల మనసులు పాడవుతున్నాయి. వాటిని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంటర్నెట్ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేయాలి’ అని పేర్కొంది.