బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్లలో ‘రిసీవబుల్స్ మేనేజర్’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది.మరి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటాయో పూర్తి వివరాలు తెలుసుకుందామా..
మొత్తం ఖాళీలు: 159
పోస్టుల వివరాలు..
బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులు
వయోపరిమితి..
అభ్యర్ధుల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు..
ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం..
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము..
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.600
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2022.
వెబ్సైట్.. bankofbaroda.in