త్వరలోనే ఏపీలో 66,309 ఉద్యోగాలకు ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే ఏపీలో 66,309 ఉద్యోగాలకు ప్రకటన

March 10, 2022

19

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను గురువారం (మార్చి 10) అసెంబ్లీ సమావేశంలో లిఖిత పూర్వకంగా సమర్పించింది. అన్ని జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాకు సంబంధించి 66,309 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. మొత్తం ప్రభుత్వ 7,71,177 ప్రభుత్వ ఉద్యోగాలు ఉండగా, వీరిలో శాశ్వత ఉద్యోగులు 5,29, 868 మంది. ఇక కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దాదాపు 1,75,000 మందిదాకా ఉన్నారు. మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు 7,04,868 మంది ఉన్నట్లు ప్రభుత్వం వివరాలు వెల్లడించింది.

అంతేకాకుండా ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా1,27,000 ఉద్యోగాలు భర్తీ చేయగా, వైద్యారోగ్య శాఖలో 22,306 ఉద్యోగాలు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీల వివరాలను ప్రభుత్వ వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేసింది.

మరోపక్క ఏపీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ.. నేడు టీడీపీ నాయకులు రోడ్డు ఎక్కిన విషయం తెలిసిందే. సీఎం హామీ ఇచ్చినట్టు భర్తీ చేస్తామన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పటినుంచో ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అవుతున్నారు. మరికొంతమంది కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ, ఉద్యోగ ప్రకటన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీలో ఉద్యోగ ఖాళీల గురించి ప్రస్తవించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.