వేల ముక్కలైన విమానం.. శిథిలాల వెలికితీతకు బుల్డోజర్లతో ప్రయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

వేల ముక్కలైన విమానం.. శిథిలాల వెలికితీతకు బుల్డోజర్లతో ప్రయత్నం

March 29, 2022

nmmnn

వారం క్రితం చైనాలో జరిగిన విమాన ప్రమాదంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 132 మంది ప్రయాణీకులతో బయలు దేరిన విమానం కొద్దిసేపటికే గుట్టల్లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదు. ఇలాంటి ప్రమాదం జరగడం గత 28 ఏళ్లో మొదటిసారి అని అధికారులు ప్రకటించారు. కూలిన తర్వాత విమానం వేల ముక్కలైందని
ఇప్పటివరకు 36 వేల ముక్కలను సేకరించామని అధికారులు తెలిపారు. దొరికిన రెండు బ్లాక్ బాక్సుల సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ అధిపతి ఝూ టావో చెప్పారు. 15 వేల మంది సిబ్బందితో శకలాల సేకరణ జరుగుతుందని వెల్లడించారు. ఫైర్ అండ్ రెస్క్యూ అధిపతి ఝెంగ్ షీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మూడున్నర లక్షల మీటర్ల వరకు గాలింపు చర్యలు చేపట్టామని, గాలింపు ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. శకలాలు భూమిలోపల దూసుకెళ్లి ఉంటాయా? అనే అనుమానంతో బుల్డోజర్లతో చాలా లోతు వరకు తవ్వుతామని వెల్లడించారు.