Aether Energy's new scooter has arrived..146 kilometers in total
mictv telugu

ఏథర్ ఎనర్జీ కొత్త స్కూటర్ వచ్చేసింది..ఏకంగా 146 కిలోమిటర్లు

July 20, 2022

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ స్కూటర్ ప్రియులకు ఓ శుభవార్తను చెప్పింది. తమ కంపెనీ తాజాగా తయారు చేసిన మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌కు ఒకసారి ఛార్జీంగ్ పెడితే ఏకంగా 146 కిలోమిటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. ఈ స్కూటర్ ఖరీదు కొంచెం ఎక్కువే అయిన గతంలో ఫీచర్స్ కంటే ఈసారి అదనపు ఫీచర్స్‌తో ఈ వాహనాన్ని తయారు చేశామని వివరాలను వెల్లడించింది.

‘మా కంపెనీ తాజాగా తయారు చేసిన ప్రీమియం స్కూటర్ 450X మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మంగళవారం విడుదల చేశాం. దీని ధర రూ.1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). 5 రైడ్‌మోడ్‌లలో 6.2 కిలోవాట్ గరిష్ఠ సామర్థ్యం గలది. పాత మోడళ్ల కంటే బ్యాటరీ ప్యాక్ సుమారు 25 శాతం పెద్దగా, 2.9-3.7 కిలోవాట్ అవర్స్ సామర్ధ్యంతో ఉంటుంది. దీంతో ఈ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 146 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అదే పాత మోడళ్లు 116 కిలోమీటర్లే వెళ్లేవి. నగరాల్లో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని, ఒకసారి ఛార్జింగ్‌తో గతంలో ఏఆర్ఎఐ ధ్రువీకరించిన 85 కి.మీ నుంచి 105 కి.మీ.కు సామర్యం పెరుగుతుంది” అని కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఈఓ తరుణ్ మెహతా వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో నెలకు 35,000 విద్యుత్ ద్విచక్ర వాహనాలు విక్రయమవుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య లక్షకు చేరుతుందనే అంచనాలున్నాయి. అందులో 30 శాతం వాటాను ఏథర్ దక్కించుకోవాలనుకుంటోందని అధికారులు పేర్కొన్నారు.