తాలిబన్ల ధమ్కీ.. సీక్రెట్‌గా మద్రాస్ ఐఐటీ నుంచి పీజీ పూర్తిచేసిన యువతి
ఆడపిల్లలకు చదువెందుకు అంటూ స్కూళ్లు పేల్చేస్తూ, నీటిలో విషం కలుపుతూ నానా ఘోరాలకు పాల్పడుతున్న అప్ఘానిస్తాన్ పాలక తాలిబన్లపై ఓ యువతి చరిత్రాత్మక విజయం సాధించింది. నిత్యం మతఛాందస నిఘా మధ్యనే కెమికల్ ఇంజనీరింగ్‌లో పీజీ పూర్తి చేస్తే టాప్ ర్యాంకుతో పాసైంది. తాలిబన్లకు మస్కా కొట్టి, ఇంటినే ఓ లేబొరేటరీగా మార్చుకుని గుట్టుచప్పుడు కాకుండా అనుకున్నది సాధించింది. డిగ్రీ రావడంతో, ‘‘ఇప్పుడు మీరేమీ చేసేకోలేరు. మీరొక దారి మూసేస్తే నేనింకో దారి కనుక్కుంటా. నేనేం తప్పుచేయలేదు. సిగ్గుపడాల్సింది, బాధపడాల్సిందే మీరే’’ అని అంటోంది.
ఆమె పేరు బెహిస్తా ఖైరుద్దీన్. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌కు చెందిన బెహిస్తా 2021లో మద్రాస్ ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ పీజీలో సీటు పొందింది. అయితే ఏడాది తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ ఆక్రమించుకోవడంతో ఆమె మద్రాస్‌కు రాలేకోపోయింది. నిత్యం నిఘా, ఎయిర్‌పోర్టులో తనిఖీలు తప్పించుకుని ఇండియా చేరడం అసాధ్యం కావడంతో ఇంట్లోనే చదువుకు సిద్ధమైంది. ఆయన పరిస్థితి గమనించి ఐఐటీ యాజమాన్యం అన్ని రకాలుగా సహరించుకుంది. మారుమూల ఊరిలో, అరకొర ఇంటర్నెట్ సదుపాయంతోనే బెహిస్తా పరీక్షలన్నీ పూర్తి చేసింది. బీకర్లను ఇరుగుపొరుగువారి నుంచి అరువుకు తెచ్చుకుని వంటింటినే ప్రయోగశాలగా మార్చింది. సోదరి ఇచ్చి మైక్రో ఓవెన్ సాయంతో ప్రయోగాలు చేసింది. తన చదువు, కష్టనష్టాలను మీడియాతో పంచుకున్న ఆమె మద్రాస్ ఐఐటీ సిబ్బంది సాయం మరవలేనిదని, తనకు మెటీరియల్‌తోపాటు స్కాలర్‌షిప్ కూడా వచ్చిందని చెప్పింది. బెహిస్తా కుటుంబ సభ్యులందరూ ఉన్నత విద్యావంతులే.