షఫాక్ ఫసక్..బంగ్లా క్రికెటర్‌పై ఆరేళ్లు నిషేధం
క్రికెటర్లలో అవినీతిపరులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. ఇటీవల పాక్ క్రికెటర్ అక్మల్ అవినీతికి పాల్పడి మూడేళ్ళ నిషేధానికి గురైన సంగతి తెల్సిందే. తాజాగా మరో ఆఫ్గానిస్థాన్ సీనియర్ ఆటగాడు ఆరేళ్ళ నిషేధానికి గురయ్యాడు. క్రికెటర్, వికెట్ కీపర్ షఫీఖుల్లా షఫాక్‌పై ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ఆరేళ్లపాటు నిషేధం విధించింది. ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ టీ20 2018 ఎడిషన్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019 ఎడిషన్‌లలో అవినీతికి పాల్పడినట్లు అంగీకరించడంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని రూల్ 2.1.1ను అతను అత్రికమించినట్లు బోర్డు తెలిపింది. అలాగే రూల్ 2.1.3ని కూడా షఫాక్ కూడా ఉల్లంఘించినట్టు ఏసీబీ తేల్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చెయ్యడం… బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని కావాలనే దాచిపెట్టడం తదితర అభియోగాలతో షఫాక్‌పై ఏసీబీ చర్యలు తీసుకుంది. ముప్పైఏళ్ళ షషాక్ ఇప్పటివరకు ఆఫ్గానిస్థాన్ జట్టు తరపున 24 వన్డేలు, 46 టీ20లను ఆడాడు. గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా ఆడాడు.