ఆస్పత్రిలో ఉగ్రఘాతుకం.. పసిపిల్లలను వదల్లేదు
ముష్కరులు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోయారు. ఏకంగా ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇందులో ఇద్దరు పసి కందులు కూడా ఉన్నారు. పశ్చిమ కాబూల్’లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. తాజాగా ఘటనతో ప్రభుత్వం అప్రత్తమైంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. భద్రత చర్యల్లో భాగంగా అదనపు బలగాలను మోహరించారు.
తుపాకులు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు ఓ ప్రసూతి ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడికి వెళ్లిన వెంటనే తూటాల వర్షం కురిపించారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చివేశారు. పసి బిడ్డలు అనే కణికరం కూడా లేకుండా బుల్లెట్లు దింపారు. ఈ ఘటనలో ఇద్దరు నర్సులు, 12 మంది బాలింతలు, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కళ్లు కూడా తెరవని చిన్నారులను నరరూప రాక్షశుల్లా ప్రాణాలు తీయడంపై పలువురు ఖండించారు.