నాన్‌వెజ్ ప్రేమికులకు.. ఒక అశుభవార్త! ఏంటంటారా? బాగా కాల్చిన చికెన్ తందూరీని ఇష్టపడేవారికి ప్రమాద హెచ్చరిక! ఇది ఎక్కువ తినేవారికి క్యాన్సర్ ముప్పు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
చికెన్ ఉడికించి తింటే ఏం పర్వాలేదు. లేకపోతే మారినేట్ చేసి కర్రీలా చేసుకున్నా నష్టం రాదు. కానీ అదే చికెన్ నిప్పుల పై కాల్చుకొని తింటే మాత్రం క్యాన్సర్ వస్తుంది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా తన తాజా అధ్యయనంలో తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం 60శాతం మంది చికెన్ తందూరీలా చేసుకొని తినడానికే ఇష్టపడుతున్నారట. ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం కష్టం. ఒకవేళ గుర్తిస్తే దీన్ని తగ్గించడం సులువు. కానీ ఇది ఇతర ఆర్గాన్లకు చేరేవరకు మనం దీన్ని గుర్తించలేం అంటున్నారు వైద్యులు.
మాంసాన్ని బహిరంగ మంటమీద ఉడికించడం వల్ల పై పొర పై క్యాన్సర్ కారక సమ్మేళనాలు చేరుతాయి. క్యాన్సర్ కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్లు ఈ వేడికి మరింత పెరుగుతాయి. మండే కొవ్వు సాధారణంగా నిప్పు మీద కారుతుంది. ఇది పాలీ సైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్ లకు దారితీస్తుంది. ఇది మానవ వినియోగానికి ప్రమాదకరం. అందుకే తందూరీకి వాడే గ్రిల్ ఎప్పటికప్పుడు తుడిచేయాలి. చికెన్‌ని చిన్న ముక్కలుగా చేసి మైక్రోవేవ్‌లో ముందు వేడి చేసి గ్రిల్ చేస్తే కాస్త మంచిదని వీరు చెబుతున్నారు. చిన్నగా కట్ చేయడం వల్ల ముక్క బాగా గ్రిల్ అవుతుంది. అలాగే మంట కూడా ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. 2019 ప్రకారం యూఎస్‌లో ఉండే వారిలో 89,248 పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది.