అఫ్గాన్ దెబ్బకు కుప్పకూలిన బంగ్లాదేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

అఫ్గాన్ దెబ్బకు కుప్పకూలిన బంగ్లాదేశ్

September 9, 2019

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు అద్భతమైన ఆటతీరుతో అందరిని ఆశ్చర్యపరిచారు. చిట్టగాంగ్‌లో సోమవారం జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్‌తో విజయం సాధించింది. 224 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గాన్ 342 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 205 పరుగులకే అలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసి 398 లక్ష్యాన్ని ఉంచింది. దీంతో విజయంపై ఆశలు వదులుకున్న బంగ్లా ఆటగాళ్లు డ్రా కోసం ప్రయత్నించినప్పటికీ వికెట్లు కుప్పకూలడంతో 224 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్, రహ్మత్ షా బ్యాటింగ్‌తో బంగ్లా ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో  రహ్మత్ షా 102 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 55 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రషీద్ ఖాన్ 49 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే అలౌట్ అయింది. విజయం అఫ్గానిస్తాన్ వశమైంది. ఈ మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడమే కలిసి వచ్చింది. ఒక టెస్టు సిరీస్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజేతగా నిలిచి కప్ కైవసం చేసుకుంది.