Afghanistan women protest in Kabul
mictv telugu

హక్కుల కోసం మహిళల ర్యాలీ.. తాలిబన్ల కాల్పులు..

August 13, 2022

Afghanistan women protest in Kabul

అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలై ఏడాది దాటిపోతున్నా పరిస్థితి ఏమాత్రం మారలేదు. తాము పాత తాలిబన్లం కాదని, మహిళల హక్కులను గౌరవిస్తామని మిలిటెంట్లు చేసిన వాగ్దానం నీటిమూటే అయ్యింది. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని, తక్కువ జీతానికే పనిచేయాలని, మగతోడు లేకుండా ప్రయాణాలు చేయొద్దని ఇస్లామిక్ ఛాందస పాలకులు ఆంక్షలు విధిస్తున్నారు. ప్రశ్నించిన వాళ్లను అణచేస్తున్నారు. వారి నిరంకుశత్వానికి నిరసనగా కాబూల్‌లో మహిళా లోకం నిద్రలేచింది. హక్కుల కోసం నిరసన ర్యాలీ జరిపింది. తాలిబన్ల తుపాకుల పహరాలో సాగిన ఈ ర్యాలీ దృశ్యాలు కలకలం రేపుతున్నారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలను తాలిబన్లు దారుణంగా హింసించారారు. కాల్పులతో భీభత్సం సృష్టించారు. వెంటపడి చెదరగొట్టారు.

గత ఏడాది ఆగస్ట్ 15 తాలిబన్లు అఫ్ఘాన్‌ను దురాక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజధానిలో 40 మందికిపై మహిళలు నిరసన తెలిపారు. ‘మాకు తిండి కావాలి, స్వేచ్ఛ కావాలి. మూర్ఖత్వంలో విసిగిపోయాం..’ అని నినదిస్తూ రోడ్డుక్కారు. తాలిబన్లు ర్యాలీని చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. మహిళలు భయంతో రోడ్డుపక్కనున్న షాపుల్లో తలదాచుకోగా అక్కడికీ వెళ్లి దాడులు చేశారు. ఈ అణచివేతపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లు ఏమాత్రం మారలేదని ఈ ఉదంతం రుజువు చేస్తోంది.