ప్రస్తుతానికి క్షమిస్తాం.. రిపీటయితే మాత్రం మామూలుగా ఉండదు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రస్తుతానికి క్షమిస్తాం.. రిపీటయితే మాత్రం మామూలుగా ఉండదు

April 25, 2022

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశంపై దాడి చేసిన పాకిస్తాన్‌ను ప్రస్తుతానికి క్షమిస్తున్నాం.. మరోసారి ఇలా జరిగితే మా ప్రతిఘటనను చూడాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది. ఈ మేరకు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ కుమారుడు, ప్రస్తుత దేశ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మొహమ్మద్ యాకూబ్ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఖోస్త్, కునార్ ప్రావిన్సులలో పాకిస్తాన్ మిలిటరీ హెలికాప్టర్‌లతో దాడి చేసింది. ఇందులో 20 మంది చిన్నారులు సహా, 36 మంది చనిపోయారు. అయితే ఇంతవరకు పాకిస్తాన్ ఈ దాడులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై తాలిబన్ మంత్రి వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ఇరు దేశాలు క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అరికట్టడానికి కలసి పోరాడాలని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, పాక్, ఆప్ఘన్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఈ కారణంగా సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య పలుమార్లు కాల్పులు జరిగాయి కూడా.