ఒక్కో బ్రూ ప్యాకెట్.. రూ.6 వేలు.. పాత కస్టమర్లకైతే 5 వేలే - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కో బ్రూ ప్యాకెట్.. రూ.6 వేలు.. పాత కస్టమర్లకైతే 5 వేలే

May 24, 2022

అదేంటీ.. నిత్యవసరాల ధరలు పెంచినట్లు బ్రూ ప్యాకెట్ల రేట్లు కూడా పెంచేశారనుకుంటున్నారా?.. అలాంటిదేం లేదు. ప్యాకెట్ మాత్రమే బ్రూ కంపెనీది.. లోపల మాత్రం కాఫీ పౌడర్‌కు బదులు వేరే సరుకు ఉంది. బ్రూ కాఫీ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్‌లో అమ్ముతున్నాడు ఓ ఫారెనర్. పురానాపూల్ వద్ద మోరిస్ అనే ఆఫ్రికన్ దేశస్తుడు.. సందీప్ అనే వ్యక్తికి కొకైన్ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. హోండా యాక్టివా పట్టుకున్నామని.. అందులో ఏడు గ్రాముల కొకైన్ దొరికినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ వెల్లడించారు. ఆఫ్రికా దేశస్థుడు ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. అతని కారులో 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికి అనుమానం రాకుండా… వనస్థలిపురం, సన్ సిటీ నుండి ఈ డ్రగ్స్ సప్లయ్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్‌లో ఒక్కో గ్రాము కొకైన్ ఉంటుంది. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పాతవాళ్లకు ఐదు వేల రూపాయలు, కొత్త వాళ్లకు ఆరు వేలు చొప్పున గ్రామ్ కొకైన్ విక్రయిస్తున్నట్లు విజయ్ తెలిపారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని.. ఈ లింక్‌తో సంబంధమున్న అందర్నీ అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.