African grey parrot lucky man in Karnataka
mictv telugu

జబ్బు చిలుక.. అతనికి 85 వేలు దక్కించింది..

July 23, 2022

చిలుక జోస్యంపై నమ్మకమున్నా లేకపోయినా అదృష్టలక్ష్మి ఓ చిలుక రూపంలో అతన్ని కనికరించింది. 85 వేల నగదు బహుమతిని తెచ్చిపెట్టింది. తిండితిప్పల్లేక అనారోగ్యంపాలై బిక్కుబిక్కుమంటున్న ఓ చిలుక అతని కంటపడ్డమే దీనికి కారణం. క‌ర్ణాటకక‌లోని తుమ‌కూరులో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
అర్జున్ అనే వ్యక్తి మూడేళ్లుగా పెంచుకుంటున్న ఆఫ్రికన్ గ్రే జాతి చిలుక ఈ నెల 16న ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో, తన చిలుక ఎవరికైనా కనిపిస్తే తనకివ్వాలని, రూ. 50 వేల రివార్డు ఇస్తానని అర్జున్ ప్రకటించారు. చిలుక పోస్టర్లు కూడా వేయించాడు. శుక్రవారం శ్రీనివాస్ అనే వ్యక్తికి సదరు చిలుక తుముకూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వారం రోజులుగా తిండితిప్పలు లేకపోవడంతో జబ్బుపడి అనారోగ్యం పాలైంది. శ్రీనివాస్ దాన్ని పట్టుకుని అర్జున్‌కు అప్పగించాడు. అర్జున్ సంతోషంతో తను ప్రకటించిన రివార్డుకు మరో 35 వేలు కలిపి మొత్తం రూ. 85 వేలు ఇచ్చాడు.