అసోంలో కొత్త వైరస్ కలకలం.. 2,500 పందులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అసోంలో కొత్త వైరస్ కలకలం.. 2,500 పందులు మృతి

May 4, 2020

African Swine Flu in Assam

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మరో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. కొత్తగా అసోంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ సోకడంతో కలవరం మొదలైంది. దీంతో ప్రజలు భయాందోళణకు గురౌతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి దాదాపు 2,500 పందులు మరణించాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

దీని దాటికి ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. కేంద్రం వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు అనుమతించింది. పందులను పరీక్షించి వ్యాధి నివారణకు కావాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటిస్తున్నారు. దీని వల్ల మానవులకు ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రాణాంతక కరోనా మహమ్మారిని అడ్డుకున్న ఆ రాష్ట్రంలో కొత్త వైరస్ పుట్టుకురావడంతో అక్కడి వారిని అయోమయానికి గురి చేస్తోంది.