Afridi gave an unexpected twist on the India-Pakistan match
mictv telugu

భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌పై..ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన అఫ్రిది

August 24, 2022

భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఆ మ్యాచ్‌ను ప్రతి భారతీయుడు ఓ యుద్ధంలానే చూస్తాడు తప్పా, క్రికెట్ మ్యాచ్‌లా చూడడు. ఎందుకంటే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటేనే ఓ హైవోల్టేజ్‌. అలాంటి మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులతోపాటు యావత్ దేశం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది. ఎట్టకేలకు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పోరు ఖారారు అయ్యింది. ఆదివారం (ఆగస్టు 28)న దుబాయ్‌లోని షేక్‌ జాయేద్‌ స్టేడియంలో రెండు జట్లు ఎదురుపడనున్నాయి.

ఈ క్రమంలో ఇటు భారతదేశంలో అటు పాకిస్తాన్‌లో మ్యాచ్‌పై భారీ ఉత్కంఠ నెలకొంది. షెడ్డ్యూల్ ఖారారైన రోజు నుంచే మ్యాచ్‌పై అంచనాల వార్ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు మాదంటే మాదే అని ఎవరికి వాళ్లే జోస్యం చెప్పుకుంటున్నారు.

ఈ విషయంపై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని ఇద్దరిలో విజేత ఎవరనుకుంటున్నారు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ”పాకిస్తాన్‌, భారత్‌లలో ఏ జట్టు బలంగా ఉందని అనుకుంటున్నారు. ఎవరు మ్యాచ్‌ గెలుస్తారని అనుకుంటున్నారు?” అని అడగగానే అఫ్రిది..”ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్‌ గెలుస్తారు” అంటూ సమాధానం ఇచ్చాడు. అఫ్రిది నుంచి ఈ జవాబు వస్తుందని అభిమానులు ఊహించలేదు. ఎందుకంటే అఫ్రిది..క్రికెట్ పరంగా భారత్ జట్టుపై ఎప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంటాడు.

మరోపక్క ఇదే స్టేడియంలో గత సంవత్సరం అక్టోబరులో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌..భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి అదే వేదికలో ఈ రెండు జట్లు ఎదురుపడుతుండడంతో ఆసక్తిగా మారింది. టి20 ప్రపంచకప్‌లో తమకు ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేక పాకిస్తాన్‌కు మరోసారి దాసోహం అవుతుందా అనేది చూడాలి.