భారత జెండాపై అఫ్రిదీ గౌరవం.. మనసులు దోచేసిండు..! - MicTv.in - Telugu News
mictv telugu

భారత జెండాపై అఫ్రిదీ గౌరవం.. మనసులు దోచేసిండు..!

February 10, 2018

దేశాలు, జెండాలు వేరైనా.. మమతలు, మమకారాలు ఒకటే. అభిమానానికి హద్దులు ఉండవు. పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆవేశకావేశాలు వస్తాయి. అయితే పాక్ మాజీ ఆల్ రౌండర్ అఫ్రిదీ మాత్రం భారతజాతి పతకాన్ని గౌరవించి కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. తనను చూసిన పొంగిపోయిన భారతీయులు ఆ ఉద్వేగంలో తమ జెండానే మరిచిపోగా.. అతడు మాత్రం జెండా సరిగ్గా నిలిపి, గౌరవించి, సామరస్యానికి ఛత్రం పట్టాడు.

 

Thank u Switzerland ?

A post shared by Shahid Afridi (@safridiofficial) on


స్విట్జర్లాండ్‌లో మొన్న నిర్వహించిన ఐస్ క్రికెట్ మ్యాచ్ ఈ ముచ్చటకు వేదికైంది. భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ జట్టుకు, ఆఫ్రిదీ ఆధ్వర్యంలోని జట్టుకు నడుమ సాగిన ఐస్ క్రికెట్ టీ 20 సీరిస్‌ను అఫ్రిదీ జట్టు కైవశం చేసుకుంది. మ్యాచ్ తర్వాత అఫ్రిదీ అభిమానుల దగ్గరకు వచ్చాడు. భారత జెండాలు పట్టుకుని ఉన్న ప్రేక్షకులతో సెల్ఫీలుదిగాడు.

అయితే ఒక మహిళ భారతీయ పతాకాన్ని సరిగ్గా పట్టుకోకుండా కనిపించింది. అఫ్రిదీ ఫొటోలు దిగడం ఆపేసి ఆమె వద్దకు వెళ్లాడు. ‘సీదా కరో..’ అని ఆమెకు చెబుతూ జెండాను సరిగ్గా పట్టుకొమ్మని చెప్పాడు. ఆమె సరిగ్గా విప్పగానే సెల్ఫీ  ఫొటో దిగి వెళ్లిపోయాడు అఫ్రిదీ. ఈ వీడియో మీడియాలో వైరల్ అయింది. క్రికెటర్లంటే ఇలా ఉండాలి అని ప్రశంసలు కురిపిస్తున్నారు.