Aftab ordered the fridge from Shraddha's phone
mictv telugu

శ్రద్ధ ఫోన్‌ నుంచే ఫ్రిజ్‌ ఆర్డర్‌ పెట్టిన అఫ్తాబ్

November 22, 2022

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలా.. శ్రద్ధాను చంపేసి, ఆమెను ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత ఆ శరీర భాగాలను దాచిపెట్టడానికి ఆమె ఫోన్‌ నుంచే 300 లీటర్ల ఫ్రిజ్‌ను ఆర్డర్‌ చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. శ్రద్ధ హత్య అనంతరం అఫ్తాబ్‌ ఆమె ఫోన్‌ నంబర్‌తోపాటు 3-4 సిమ్‌లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. శ్రద్ధను మే నెలలో హత్య చేసిన అఫ్తాబ్‌ ఆ తర్వాతి నెల జూన్‌లో.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో అంతకుముందు తాము ఉన్న రూమ్‌ నుంచి సామాన్లను ఓ కొరియర్‌ సంస్థ ద్వారా ఢిల్లీలోని తమ రూమ్‌కు తరలించాడు. దాదాపు 37 బాక్సుల్లో పాల్ఘర్‌లోని ఇంటి వస్తువులను గుడ్‌లక్‌ ప్యాకర్స్‌ ద్వారా వీటిని తరలించారు. దీనికి అతడు రూ.20 వేలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.

మరో వైపు శ్రద్ధ హత్య వెలుగులోకి రావడానికి 15 రోజుల ముందే అఫ్తాబ్‌ కుటుంబం పాల్ఘర్‌లోని ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా, అఫ్తాబ్‌కు లై డిటెక్షన్‌ (పాలీగ్రాఫ్) పరీక్ష నిర్వహించడం కోసం పోలీసులు సోమవారం ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ టెస్టు తర్వాతనే నార్కో టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రద్ధా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.