Aftabs Will Emerge In Every City:Assam Cm Himanta sarma On Shraddha Murder case 
mictv telugu

శ్రద్ధావాకర్ హత్య లవ్ జిహాదీ కుట్రలో భాగమే…

November 19, 2022

ఢిల్లీ మర్డర్‌ని బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో శ్రద్దా వాకర్ హత్య విషయాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రస్తావించారు. శ్రద్దావాకర్ హత్య లవ్ జిహాదీ కుట్రలో భాగమేనన్నారు.బలమైన నాయకుడు లేకుంటే ప్రతి సిటీకో అప్థాబ్ పుట్టుకొస్తాడన్నారు. ఇదే విషయంలో రెండురోజుల ముందు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్ అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావొద్దన్నారు.

సిటీకో అఫ్తాబ్

శ్రద్దా వాకర్ హత్య విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు శ్రద్ద హత్య లవ్ జిహాదీ కుట్రలో భాగమేనన్నారు. దేశంలో బలమైన నాయకుడు లేకుంటే ప్రతి సిటీకో అఫ్తాబ్ పుడుతూనే ఉంటాడని బిశ్వ శర్మ అన్నారు. అప్పుడు సమాజాన్ని కాపాడుకోలేమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రంలో మూడోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. “శ్రద్దను అఫ్తాబ్ ముంబై నుంచి తెచ్చి లవ్ జీహాద్ పేరుతో 35 ముక్కలు చేశాడు. మృతదేహాన్ని ఫ్రీజ్ ఉంచి…మరో అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని డేటింగ్ చేశాడు. తల్లిలా భావించే దేశానికి శక్తివంతుడైన నాయకుడు లేకపోతే ప్రతి సిటీలో ఇలాంటి అఫ్తాబ్‌లు పుడుతూనే ఉంటారు. అప్పుడు సమాజానికి రక్షణ ఉండదు. అందుకే 2024లో నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవడం చాలా ముఖ్యం”అని ఆయన అన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు

అంతకు రెండ్రోజుల ముందు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ శ్రద్దా వాకర్ మర్డర్ కేసు విషయంలో సహజీవనం చేసే మహిళల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రావొద్దన్నారు. “అమ్మాయిలు లివ్ ఇన్ రిలేసన్ షిప్‌లో ఎందుకు ఉంటున్నారు. ఇలాంటి రిలేషన్ షిప్‌కు తల్లిదండరులు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి జీవించాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాల్లోకి రాకూడదు. శ్రద్ధా వాకర్ హత్య కేసు నుంచి నేర్చుకోవాలి.తల్లిదండ్రులు ఆమోదిస్తేనే ఎవరితోనైనా ఉండాలి”అని కౌశల్ కిషోర్ అన్నారు.

శివసేన ఫైర్
ఈ వ్యాఖ్యల్ని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఖండించారు. చౌకబారు వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.