రికార్డ్.. కృత్రిమ గుండెతో 155 రోజులు బతికింది..  - MicTv.in - Telugu News
mictv telugu

రికార్డ్.. కృత్రిమ గుండెతో 155 రోజులు బతికింది.. 

September 25, 2019

After 155 days on blood pump, woman undergoes heart transplant in Bengaluru

కొందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతుంటాయి. ఆ అద్భుతాలు వారి జీవితాల్ని నిలబెడుతుంటాయి కూడా. అలాంటిదే ఈ ఘటన. సాధారణంగా ఎవరైనా గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు కృత్రిమ పద్ధతుల్లో గుండె కొట్టుకునేలా చేస్తారు. అలా చేశాక కొద్దిరోజుల్లోనే ఆ రోగికి గుండె మార్పిడి చేయాల్సి వుంటుంది. లేకపోతే ఆ రోగి చనిపోతాడు. కృత్రిమ పద్ధతిలో గుండె కొట్టుకునే కాల వ్యవధి 64 రోజులే వుంటుంది. కానీ, ఒకామె 155 రోజులు బతికి వైద్యులు ఆశ్చర్యపోయేలా చేసింది. దీనినే అంటారేమో నూకలు తినే బాకీ వుంటే ఎలాగైనా బతికేస్తారని. అది ఈమె విషయంలో నిజం అయిందనే చెప్పాలి. 

కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల ఆమె పేరు ఆశ (పేరు మార్చారు). స్థానికంగా ఉన్న విక్రమ్‌ ఆస్పత్రి గుండె చికిత్స విభాగంలో 2017 డిసెంబరులో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ‘వెంట్రిక్యులర్‌ టెకీకార్డియా’ సమస్య వుందని చెప్పారు. ఆమె గుండెమార్పిడికై రంగనాథ్‌నాయక్‌ నేతృత్వంలోని వైద్య బృందం సిద్ధమైంది. గతేడాది ఫిబ్రవరి7న బి-వ్యాడ్‌ యంత్రంతో కృత్రిమ పంపింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థతోనే 155 రోజులు బతికిన ఆశాకు జులై 10న గుండె మార్పిడి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. గుండె మార్పిడి తర్వాత రోగి సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఇదో అద్భుతం అని అంటున్నారు.