20ఏళ్ల తర్వాత సంతానం.. చిన్నారిపై నోట్ల వర్షం - MicTv.in - Telugu News
mictv telugu

20ఏళ్ల తర్వాత సంతానం.. చిన్నారిపై నోట్ల వర్షం

April 16, 2019

పిల్లల పుట్టడం కోసం చాలామంది మొక్కని దేవుడుండడూ, తిరగని ఆస్పత్రులు ఉండవూ, ఏళ్ల తరబడి సంతానం కోసం కొందరు పడే తపన అంతా ఇంతా కాదు. అమ్మా అని పిలుపించుకోవాలని తల్లి, పిల్లల్ని గుండెలపై ఎత్తుకుని ఆడించాలని తండ్రి, నిత్యం కలలు కంటూ ఉంటారు. అలా 20 ఏళ్లు కలలు కన్న ఓ జంటకు ఆడపిల్ల పుట్టింది. ఇంకేం.. ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

After 20 years, the daughter born in the family has done full rain In gujarat

హరియాణాలోని జింద్ జిల్లా మాల్వీ గ్రామానికి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీ గుజరాత్ ఉంటోంది. వారికి పెళ్లై ఇరవై ఏళ్లకు పైనే అయినా.. పిల్లలు పుట్టలేదు. దీంతో ఎంతో మంది దేవుళ్లు, దేవతలకూ మొక్కగా… ఇటీవల ఆడపిల్ల పుట్టింది. దీంతో సాక్ష్యాత్తూ ఆ లక్ష్మీ దేవే తమ ఇంట అడుగుపెట్టిందని ఆ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తూ.. పసికందుపై ఉన్న ప్రేమతో నోట్ల వర్షం కురిపించారు. అంతేకాదు నోట్లతో పూజలు కూడా చేశారు. పాప పుట్టిన సందర్భంగా సొంత గ్రామానికి వెళ్లి పెద్ద పండగ చేశారు. ఊళ్లో వారందర్ని పిలిచి భోజనాలు పెట్టించారు.

ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే రోడ్డుపై పడేసిన హర్యానాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.