After drinking ‘mahua’ liquor, 24 elephants sleep for hours in Odisha forest
mictv telugu

సారాయి తాగిన ఏనుగులు.. తర్వాత ఏమైందంటే..

November 10, 2022

ఈ మద్య మనుషులే కాదు జంతువులు కూడా మత్తుకు అలవాటుపడ్డాయి. ఛాన్స్ దొరికితే చాలు టేస్ట్ బాగుందంటూ మద్యాన్ని లాగించేస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గజరాజులు ఫుల్‌గా ‘సారాయి’ తాగేసి మత్తులో ఊగాయి.

శిలిపాడ జీడిపప్పు అడవికి సమీపంలో నివసిస్తున్న గ్రామస్థులు సారాయి తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్ప పువ్వు సారాయి తయారీకోసం అడవిలో పెద్ద పెద్ద కుండలను ఏర్పాటు చేశారు. సారాయి కోసం ఇప్ప పువ్వులను పెద్ద పెద్ద కుండల్లో పులియబెట్టారు. ఈ నేపథ్యంలో తాము ఉంచిన కుండల కోసం వెళ్లిన గ్రామస్థులకు అక్కడ మద్యం తాగి ఉన్న ఏనుగులు కనిపించాయి. మొత్తం సారాయి తాగేసి మత్తులో ఫుల్‌గా నిద్రపోయాయి. ఎంత లేపినా లేవకపోవడంతో వారు తలపట్టుకున్నారు. చేసేది ఏం లేక అధికారులకు సమాచార మందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగుల మందను నిద్ర లేపేందుకు విశ్వప్రయత్రాలు చేసారు. చివరకు డప్పులు కొట్టి వాటిని నిద్రలేపారు. అ తర్వాత వాటిని అడివిలోకి పంపివేసారు. మొత్తం 24 ఉన్న ఈ ఏనుగులు గుంపులో తొమ్మిది ఏనుగులు మగవి, ఆరు ఆడవి కాగా మిగిలిన తొమ్మిది ఏనుగు పిల్లలు ఉన్నాయి.