After his father was beaten by the police..he became a judge for justice
mictv telugu

తండ్రిని పోలీసులు కొట్టడంతో..న్యాయం కోసం జడ్జి అయ్యాడు..

November 22, 2022

జీవితంలో జరిగిన కొన్ని సంఘటలను స్పూర్తి నింపుతాయి..మరికొన్ని కసిని పెంచుతాయి. తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఓ పోలీసు అధికారి తన తండ్రిని కొట్టాడని బాధపడ్డ ఆ యువకుడు న్యాయం కోసం ఏకంగా కష్టపడి చదువుకుని న్యాయాధికారి (జడ్జి) అయ్యాడు. పోలీసులకంటే జడ్జీలే గొప్పవారని తన తండ్రి చెప్పిన మాటలతో కష్టపడి చదివి అనుకున్నది సాధించాడు.

బీహార్‌లోని సహ్రాసా గ్రామానికి చెందిన చోలే బటూరా కుటుంబం బతుకు తెరువు కోసం 1992లో ఢిల్లీ వెళ్లింది. ఎర్రకోట వెనకాల ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుతూ చోలే బటూరా తన కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి తన పదేళ్ల కుమారుడు కమలేష్ సాయపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలను పోలీసులు ఖాలీ చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో చోలే బటూరాను పోలీసులు కొట్టారు. బటూరా కుమారుడు కమలేష్.. ఈ ఘటన చూసి చలించిపోయాడు. తప్పు లేకుండా తన తండ్రిని కొట్టడం అతడి మదిలో ఉండిపోయింది. ఈ సమయంలో పోలీసుల కంటే జడ్జిలే గొప్ప అని.. వాళ్లు మాత్రమే మనలాంటివారికి న్యాయం చేయగలరని తన తండ్రి ఆనాడు చెప్పిన మాటలు కమలేష్‌ను కదిలించాయి. దీంతో తాను కూడా జడ్జి కావాలని నిశ్చయించుకున్నాడు. కష్టపడి చదువుకుని బిహార్లో న్యాయాధికారుల నియామకం కోసం నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షల్లో 64వ ర్యాంక్ సాధించాడు. తద్వారా తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు. న్యాయాధికారిగా ఎంపికయ్యాడు.