సినిమాల్లోకి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లోకి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

October 18, 2019

After Irfan Pathan, Harbhajan Singh to debut in Tamil cinema

భారత క్రికెటర్లు ఒక్కొక్కరిగా నటన రంగంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీశాంత్, యువరాజ్ సింగ్‌, ఇర్ఫాన్ పఠాన్‌లు ఇప్పటికే నటన రంగంలో అడుగుపెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా మరో భారత క్రికెటర్‌ హర్భజన్ సింగ్ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని హర్భజన్ ట్విటర్‌‌లో వెల్లడించాడు. 

హర్భజన్ తమిళ హాస్య నటుడు సంతానం నటిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు కార్తీక్ యోగి దర్శకత్వం వహించనున్నాడు. హర్భజన్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘డిక్కీ లూనా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.