రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి వింత వాదన
సాధారణంగా రోడ్లు బాలేకపోతే ప్రమాదాలు జరుగుతాయని అందరికి తెలిసిందే. కానీ కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ వాదన మాత్రం మరోలా ఉంది. రోడ్లు మంచిగుంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని ఆయన ఇటీవల వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. ప్రతి సంవత్సరం కర్ణాటకలో 10,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి..వీటికి రోడ్లు అధ్వాన్నంగా ఉండటమే కారణమని మీడియా చెబుతుండగా.. వాస్తవం మాత్రం రోడ్లు బాగా ఉండటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వంత పాడారు. రోడ్లు బాగుంటే యువత వాహనాలను ఎక్కువగా వేగంగా నడుపుతారని తద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. రోడ్లు బాగుంటే యువత వాటిపై హైస్పీడ్‌తో దూసుకెళతారని చెత్త రోడ్ల కంటే మంచి రోడ్లపై యువత వేగం పెంచి వాహనాలను ముందుకు ఉరికిస్తారని ఈ క్రమంంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త మోటార్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజీపీ పాలిత ప్రాంతాల్లో కర్ణాటక కూడా ఉండడం గమనార్హం.