రహదారిపై నేపాల్ అభ్యంతరాలు.. తోసిపుచ్చిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

రహదారిపై నేపాల్ అభ్యంతరాలు.. తోసిపుచ్చిన భారత్

May 10, 2020

ఉత్తరఖండ్‌లో ధర్‌చౌలా టౌన్‌ను లిపూలేఖ్ పాస్‌తో అనుసంధానిస్తూ నూతన రహదారిని భారత్‌ నిర్మించగా.. దానిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నేపాల్ భారత్‌ల సరిహద్దు వివాదం ఉన్న ప్రాంతంలో ఈ నిర్మాణం జరిగిందంటూ నేపాల్ ఆరోపించింది. ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందానికి భారత్ ఏకపక్ష నిర్ణయం మంటగలిపిందని తెలిపింది. దీనిపై భారత్ స్పందించింది. నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ.. భారత్ భూభాగంలోనే రోడ్డు నిర్మాణం జరిగిందని స్పష్టంచేసింది. అంతకుమునుపు ఉన్న దారి స్థానంలోనే కొత్త రహదారిని నిర్మించామని తెలిపింది. 

కాగా, ఈ రహదారిని 17 వేల అడుగుల ఎత్తున, 80 కీమీల పొడవుగా నిర్మించారు. భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఈ రహదారిని ప్రారంభించారు.  కలైశ్ మానసరోవర్ యాత్ర చేసే వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకే ప్రభుత్వం ఈ రహదారిని నిర్మించిన విషయం తెలిసిందే.