మొన్న పార్లమెంట్ సమావేశం చూశారా? ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన స్లీవ్ లెస్ జాకెట్ గమనించారా? అది ప్లాస్టిక బాటిళ్ల రీసైకిల్ మెటీరియల్ తో తయారు చేసింది. ఇప్పుడు ఈ జాకెట్ హాట్ టాపిక్.
నరేంద్ర మోదీ ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. ఇటీవల ప్రధాని స్కై బ్లూ జాకెట్ ధరించి పార్లమెంటుకు వచ్చారు. కానీ ఇది మామూలు జాకెట్ కాదు. ఫిబ్రవరి 6న బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) ఆయనకు బహుమతిగా ఇచ్చిన నెహ్రూ జాకెట్ ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి రీసైకిల్ చేసిన మెటీరియల్ తో తయారు చేశారు.
ఆర్డర్లు పెరిగాయి..
అన్ బాటిల్డ్ క్యాంపెయిన్ని ఆవిష్కరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్ లో రీసైకిల్ చేసిన పెట్ బాటిల్స్ తో తయారు చేసిన ప్రత్యేక జాకెట్ ను ధరించారు. దీనిని ధరించడం ద్వారా హరిత వృద్ధిని మరింత పెంచడమే సంకల్పంగా ఉన్నారని భావించవచ్చు. ఈ అద్భుతమైన జాకెట్ను తమిళనాడులోని కరూర్ కి చెందిన ఎకోలైన్ క్లోతింగ్ అనే కంపెనీ తయారు చేసింది.
సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ లో మేనేజింగ్ పార్టనర్ అయితన సెంథిల్ శంకర్.. ‘మేం ఒక ప్రైవేట్ కంపెనీ కాబట్టి నేను సంఖ్యలో వెల్లడించలేను. కానీ ఇటీవల మోదీ ధరించిన జాకెట్ ను తయారుచేయడానికి ఉపయోగించిన బ్లూ రీసైకిల్ ఫ్యాబ్రిక్ కోసం చాలామంది ప్రజలు ఆర్డర్లు ఇస్తున్నారు’ అని తెలిపారు. అంతేకాదు.. ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మా క్లయింట్ గా ఉంది. వారు ప్రధానమంత్రికి బహుమతిగా ఇస్తుందని మాకు తెలుసు’ అని శంకర్ అన్నారు. ఈ కంపెనీ తొమ్మిది ఫ్యాబ్రిక్ షేడ్స్ చూపించగా లేత నీలం రంగును వారి క్లయింట్ ఎంచుకున్నారు.
ఎలాగంటే..
పెట్ బాటిళ్లను ముందుగా సేకరిస్తారు. వాటిని చూర్ణం చేసి కరిగించి రంగును జోడిస్తారు. ఆ తర్వాత నూలును ఉత్పత్తి చేయడం ద్వారా రీసైకిల్ ఫ్యాబ్రిక్ తయారుచేస్తారు. ఈ ప్రక్రియ వివిధ ఉత్పత్తి స్థాయిల్లో ఉద్గారాలను తీవ్రంగా తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వాతావరణం నీటి కాలుష్యంలో ఐదవ వంతు వస్త్ర పరిశ్రమ కారణంగా ఉంది. దీన్ని తగ్గించే లక్ష్యంగా ఇది పని చేస్తుంది. ఇండియన్ ఆయిల్ రీసైకిల్ పాలిస్టర్, పత్తితో తయారు చేసిన రీటైల్ కస్టమర్ అటెండెంట్ ల కోసం, ఎల్ పీజీ డెలివరీ సిబ్బంది కోసం ఈ రీసైకిల్ యూనిఫామ్ లను ఇప్పటికే ఆర్డర్ చేసింది.