బాలాకోట్, అభినందన్ పైనా మూవీ - MicTv.in - Telugu News
mictv telugu

బాలాకోట్, అభినందన్ పైనా మూవీ

August 23, 2019

After prime minister Narendra Modi biopic..

పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ నేప‌థ్యంలో సినిమాను రూపొందించేందుకు ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబేరాయ్ సిద్ధమయ్యారు. ఈ అంశమై వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాను కమర్షియల్ పంథాలో తెరకెక్కించబోనని, లాభాలను ఆశించకుండా దేశం గురించి, వైమానిక దళ యుద్ధ శక్తిని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడానికే బాలాకోట్ పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. 

ఈ ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుండగా జ‌మ్ము, ఢిల్లీ, ఆగ్రా ప‌రిస‌ర ప్రాంతాల‌లో చిత్ర షూటింగ్ జ‌ర‌ప‌నున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఈ సినిమా స్టోరీకి సంబంధించి తనను, తన సినిమా బృందాన్ని విశ్వసించినందుకు గాను ఐఏఎఫ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమాకు సరైన న్యాయం చేస్తామని ఆయ‌న అన్నారు. ఇందులో అభినందన్‌తో పాటు స్క్వాడ్రన్ లీడర్‌గా తెర వెనుక సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటూ వచ్చిన మింటీ అగర్వాల్ పాత్ర కీల‌కంగా మార‌నుంది. ఈ సినిమాను హిందీ, తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.