ఏనుగులతోనూ కరోనాలాంటి ముప్పు.. కేంద్రానికి ‘పెటా’ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగులతోనూ కరోనాలాంటి ముప్పు.. కేంద్రానికి ‘పెటా’ లేఖ

May 14, 2020

PETA

రాత్రిపూట సంచరించే గబ్బిలాల నుంచి కరోనా సోకి, ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అయితే గబ్బిల్లాల తీరులోనే ఏనుగుల వల్ల కూడా కరోనా వంటి వైరస్ వ్యాపించే అవకావం ఉందని పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆప్ ఎనిమల్స్) సంస్థ హెచ్చరించింది. మనుషుల పెంపకంలో ఉండే ఏనుగుల్లో ట్యూబరిక్యులోసిస్ వ్యాధి ఉందని, దాంతో  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పింది. ఏనుగులతో ప్రజారోగ్యానికి హాని ఉందని పేర్కొంటూ.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు పెటా లేఖ రాసింది. ఏనుగులను బహిరంగ కార్యక్రమాల్లో ప్రదర్శించడం, ఊరేగింపులను ఏర్పాటు చేయడం వంటి వాటిపై నిషేధం విధించాలని లేఖలో పేర్కొంది. 

కాగా, కరోనా జంతువుల నుంచి మనుషులకు పాకి, కేవలం ఆరు నెలల్లో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. జంతువుల నుంచి వ్యాపించే రోగాల పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇటువంటి వ్యాధులను శాస్త్ర పరిభాషలో జూనాటిక్ వ్యాధులు అని అంటారు. వ్యాక్సిన్ వచ్చినా దీనిని పూర్తిగా అంతమొందించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.