After surname Dutta becomes kutta in ration card, Bengal man barks before babu in protest
mictv telugu

కుక్కలా మొరుగుతూ సామాన్యుడి వినూత్న నిరసన

November 20, 2022

అలవాటులో పొరపాటుగా కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. ఉదాహారణకు సర్టిఫికెట్లలో పేరు, పుట్టిన తేదీ, ఫోటో.. ఇలా ప్రతీ విషయంలోనూ ఏమరపాటుగా ఉంటారు. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన అనుభవిస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ రాష్ట్రంలోని బంకురా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డ్లో పలుమార్లు తన పేరు తప్పుగా పడిందన్న ఆవేదనతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కారు ఎదుట కుక్కలా అరుస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. బంగాల్‌లోని బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ‘గడప వద్దకే ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.

అతని పేరు తప్పుగా ప్రింట్‌ అవ్వడం ఇదే మొదటిసారి కాదట. గతంలోనూ రెండుసార్లు ఇలాగే జరిగిందట. తొలిసారి శ్రీకాంతి కుమార్ దత్తా బదులు శ్రీకాంత మొండల్‌ అని రాశారట. తప్పును సరిచేయాలని జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకుంటే.. శ్రీకాంతో దత్తా అని మార్చారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన గడప వద్దకే కార్యక్రమంలో సమస్యను ప్రస్తావించగా శ్రీకాంతి కుమార్‌ కుత్తా అని మార్చారని బాధితుడు వాపోయాడు. దీంతో అధికారి ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టానని చెప్పుకొచ్చాడు. ఇక, ఆ అధికారి సైతం అతడి తీరు పట్ల విసుగు చెందకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.