టీవీ డిబేట్ లో పాల్గొన్న కొన్ని నిమిషాలకే కాంగ్రెస్‌ నేత మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ డిబేట్ లో పాల్గొన్న కొన్ని నిమిషాలకే కాంగ్రెస్‌ నేత మృతి 

August 13, 2020

After TV debate, Congress leader Rajiv Tyagi passed away

నిత్యం టీవీల్లో ఎన్నో రాజకీయ చర్చలు జరుగుతుంటాయి. అధికార పక్షం నుంచి కొందరు, ప్రతిపక్షం నుంచి కొందరు నేతలు ఆ చర్చల్లో పాల్గొంటారు. కొన్ని సార్లు అలాంటి చర్చలు ఉద్వేగాలు రెచ్చగొట్టే స్థాయి చేరుతాయి. తాజాగా అలాంటి ఓ టీవీ డిబేట్ కారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాజీవ్ త్యాగి ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఆజ్‌తక్‌ వార్తా చానెల్‌లో ఆయన పాల్గొన్న డిబేట్ ఉద్వేగానికి దారితీసింది. ఆ డిబేట్ లో పాల్గొన్న కొన్ని నిమిషాల తరువాత ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 

రాజీవ్ త్యాగి మరణంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. త్యాగి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తరప్రదేశ్‌లో మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన కాంగ్రెస్ జాతీయ ప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కీల‌కంగా ప‌నిచేశారు. త్యాగి మృతి పట్ల కాంగ్రెస్‌ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, బీజేపీ నేత సబిత్‌ పాత్రా, ఎన్సీపీ నేత నవాబ్‌మాలిక్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపారు.