After Vijay Devarakonda, some of heros joins naked photoshoot trend
mictv telugu

ఈ హీరోలకి పిచ్చిపట్టిందా? మొత్తం విప్పి చూపిస్తున్నారు

July 25, 2022

సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ లేదా ఇతర ఏ ఫోటో షూట్‌లో అయినా ఇప్పటివరకు హీరోయిన్ల అందాల ఆరబోత గురించే విన్నాం. కానీ ఇప్పుడు హీరోలు మాత్రం అంతకుమించి ఒంటి మీద నూలు పోగు లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ సంచలనంగా మారిపోతున్నారు .విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ అని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు.
లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ చేసిన న్యూడ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలయింది. దీంతో తామేం తక్కువ కాదు అన్నట్లుగానే ఒకరి తర్వాత ఒకరు న్యూడ్ ఫోటోలు తీసి జనాల మీదకు వదులుతున్నారు. బాలీవుడ్ నటుడు రాహుల్ కన్నా ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం అర్ధనగ్నంగా ఫోటోలు దిగాడు. అతని తర్వాత స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా న్యూడ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక రణవీర్ సింగ్ ఏకంగా నగ్నంగా ఫోటోలు పోస్ట్ చేయడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు.

ఇక తానూ కూడా ఈ ట్రెండ్ లో జాయిన్ అయ్యానంటూ.. తమిళ హీరో తెలుగులో అరణ్య సినిమాల్లో నటించి మెప్పించిన విష్ణు విశాల్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి రచ్చ చేశాడు. విష్ణు విశాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ని వివాహం చేసుకున్నాడు. నా భార్య ఫోటోగ్రాఫర్ గా మారి ఫోటోలు తీసిందంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చి ఫోటోలు షేర్ చేశాడు. ఇక తాజాగా గీతా మాధురి భర్త నందు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు. రణ్ వీర్ సింగ్ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్నాను అంటూ ఫోటో షూట్ చేశాడు. తన సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ టవల్ కట్టుకుని స్టిల్ ఇచ్చాడు. అయితే ఇవి చూస్తున్న నెటిజన్లంతా వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ హీరోలకి ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు’, ‘నటులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హీరోల న్యూడ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయనే చెప్పాలి.