ఎట్టకేలకు కోహ్లీ కోరిక నెరవేరింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు కోహ్లీ కోరిక నెరవేరింది..

October 17, 2018

విదేశీ టూర్ల‌కు భారత ఆటగాళ్లతో పాటు వారి భార్యలను, ప్రియురాళ్లను అనుమతించాలని టీమిండియా కెప్టెన్ కోహ్లి చేసిన అభ్యర్థనకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. అయితే విదేశీ టూర్ మొదలైన పదిరోజుల తర్వాత మాత్రమే వారు క్రికెటర్ల వద్దకు వెళ్లాలని సీఓఏ షరతు పెట్టింది. బీసీసీఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చి, వారిని టూర్ మొత్తానికీ అనుమతించాలని ఈ మధ్యే కెప్టెన్ కోహ్లి బీసీసీఐని కోరాడు.After Virat Kohli Request On The Stay Of Wags, BCCi Makes A Decision to allow wives and lovers for foreign tours భార్యలు, ప్రియురాళ్లు పక్కనుంటే మరింత రాణించగలమంటూ కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్ రవిశాస్త్రి, కోహ్లీ, రోహిత్ శర్మను పాలకుల కమిటీతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.