అబ్బాయి పెళ్లి వయసు తగ్గింపు!  - MicTv.in - Telugu News
mictv telugu

అబ్బాయి పెళ్లి వయసు తగ్గింపు! 

October 30, 2019

Age of marriage for men could soon be reduced to 18

ఈతరం యువత ప్రేమకు, పెళ్లికి చాలా తొందర పడుతున్నారు. ఒంటిమీదకు 16 ఏళ్లు రావడమే ఆలస్యం అన్నంత పని చేస్తున్నారు. మూతిమీద మీసాలు మొలకెత్తడంతో ప్రేమకు, పెళ్లికి తాము రెడీ అనేస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలంటే 2006 బాల్య వివాహాల నియంత్రణ చట్టం(పీసీఎంఏ) ప్రకారం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాలి. అయితే ఇకపై అబ్బాయిలు కూడా 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయిల పెళ్లి వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

అక్టోబర్ 18న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినట్లు ఓ ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది. ఆ సమావేశంలో న్యాయశాఖ, హోంశాఖ, ఆరోగ్యశాఖ, గిరిజన, మైనారిటీ శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నట్లు ఆ కథనంలో తెలిపింది. చట్టాన్ని అతిక్రమించేవారికి విధించే జైలు శిక్షను 2 నుంచి 7 సంవత్సరాలకు పెంచడంతో పాటు.. జరిమానాను రూ. లక్ష నుంచి 7 లక్షలకు పెంచాలని కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.