ఊపిరి పీల్చుకున్న భారత్.. నకిలీ కరెన్సీ పాపి నేపాల్‌లో హతం - MicTv.in - Telugu News
mictv telugu

ఊపిరి పీల్చుకున్న భారత్.. నకిలీ కరెన్సీ పాపి నేపాల్‌లో హతం

September 22, 2022

దేశంలో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ సప్లై చేస్తున్న పాక్ కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. లాల్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి నకిలీ భారత కరెన్సీని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి భారత్‌కు సరఫరా చేసేవాడు. కాగా ఈ నెల (సెప్టెంబర్ 19న) నేపాల్‌లోని ఖాట్మండులో అతని రహస్య స్థావరం వెలుపల దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. అందుకు సంబంధించిన అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖాట్మండులోని గోతాటర్ ప్రాంతంలో లాల్ మహ్మద్ తన ఇంటి బయట ఒక కారు నుండి దిగుతుండగా.. ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. తప్పించుకునే వీలు లేకపోవడంతో మహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. లాల్ మహ్మద్ కుమార్తె తన తండ్రిని రక్షించడానికి ఇంటి మొదటి అంతస్తు నుండి దూకడాన్ని CCTV ఫుటేజీలో కనిపించింది. అయితే, ఆమె తన తండ్రి వద్దకు చేరుకునే సమయానికి లాల్ మహ్మద్ మరణించాడు. లాల్ మహ్మద్‌ లాజిస్టిక్స్ మద్దతుతో ఐఎస్‌ఐ కు సహాయం చేసాడు. అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం D-గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా అధికారులు తెలిపారు. అలాగే, ఇతర ISI ఏజెంట్లకు కూడా ఆశ్రయం కల్పించాడన్నారు.