Agnipath agniveer scheme Punjab assembly passed motion against
mictv telugu

‘అగ్నిపథ్’కు షాక్.. వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం

June 30, 2022

Agnipath agniveer scheme Punjab assembly passed motion against

భారత సాయుధ బలగాల్లో ప్రవేశపెట్టిన తాత్కాలి సైనిక పథం అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నా కేంద్రం వెనక్కి తగ్గకుండా నియామాకాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ గురువారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈమేరకు ప్రవేశపెట్టిన తీర్మానం సులువుగా నెగ్గింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వ్యతిరేకించారు.

అగ్నిపథ్ పథకంతో దేశ యువతకు అన్యాయం జరుగుతుందని భగవంత్ చర్చలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ పథకాన్ని వెంటనే వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీర్మానాన్ని విపక్ష కాంగ్రెస్ నేత ప్రతాప్ బజ్వా, అకాలీదళ్ నేత మన్‌ప్రీత్ సింగ్ అయాలీలు కూడా సమర్థించారు. ఆర్మీ, నేవీ, వాయుసేనల్లో నాలుగేళ్ల ఒప్పందం కింద సైనికులను నియమించుకోడానికి ఈ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. పరోపక్క ఈ పథకం కింద ఎంపిక కావడానికి లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.