Agniveer Syllabus in VI App
mictv telugu

అగ్నివీరులకు గుడ్ న్యూస్.. వొడాఫోన్ ఐడియా యాప్‌లో సిలబస్

July 14, 2022

 

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా అగ్నివీర్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీర్ నియామకాలకు సంబంధించిన సిలబస్‌ను తన యాప్ ద్వారా అందిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నేవీ, ఎయిర్ ఫోర్స్ నియామక సిలబస్ అందుబాటులో ఉండగా, త్వరలో ఆర్మీ సిలబస్‌ను కూడా అందిస్తామని ప్రకటించింది. ఇందుకోసం డెహ్రాడూన్‌లోని ‘క్యాడెట్స్ డిఫెన్స్ అకాడమీ’తో కలిసి టెస్ట్ సిరీస్‌ని రూపొందించింది. మొత్తం ఐదు టెస్ట్ సిరీస్‌లు ఉండగా, ఒక్కో దాంట్లో 15 టెస్టులు ఉంటాయి. త్రివిధ దళాల్లో ఎంపికవ్వాలనుకునేవారికి ఈ సిలబస్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీనికోసం వీఐ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ఎంటర్ అవ్వాలి. ఈ సేవలు ఒక నెల పాటు ఉచితంగా, తర్వాత ఏడాదికి రూ. 249 చొప్పున ఫీజు ఉంటుంది. అగ్నివీర్ కాకుండా మరో 150కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉంది.