కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు

August 19, 2017

తెలంగాణలో వ్యవసాయ రంగ పురోగతికి అపారంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేసింది.  ప్రతిష్టాత్మక అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు2017కు ఆయన ఎంపికయ్యారు.  వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చినందుకుగాను ఆయనను పాలసీ లీడర్ షిప్ కేటగిరీలో అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగే గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ సదస్సులో ఆయనకు పురస్కారాన్ని అందజేస్తారు.

ఇటీవల ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నేతృత్వంలోని కమిటీ పలువురి పేర్లను పరిశీలించిన కేసీఆర్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. తెలంగాణ ప్రభుత్వం సాగు అభివృద్ధి కోసం ప్రారంభించిన అనేక పథకాలు, కార్యక్రమాలతో వ్యవసాయానికి చేయూత లభించిందని  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కొనియాడింది.

2008లో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ఇదిరకు బలరాం జక్కర్, స్వామినాథన్, కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులకు ప్రదానం చేశారు.