మట్టిలో కలిసిపోకుండా మరో మనిషిలో బ్రతకండి... - MicTv.in - Telugu News
mictv telugu

మట్టిలో కలిసిపోకుండా మరో మనిషిలో బ్రతకండి…

August 12, 2017

 

ఆగస్టు 13 న ప్రపంచ అవయవదాన దినోత్సవం.అవయవదానం చేయడం వలన మరొక వ్యక్తికి రెండో సారి జన్మనిచ్చినట్టు అవుతుంది. వైద్య నిపుణుల లెక్కల ప్రకారం ఇండియాలో 0.08 మంది మాత్రమే తమ అవయవాలను దానం చేస్తున్నారట. అదే స్పానియార్డు, బెల్జియన్లు 70- 80 శాతం ఆర్గాన్స్ డొనేషన్ చేస్తున్నారట. ప్రతి ఏడాది భారత్ లో లక్ష మందికి లివర్లు, 2 లక్షల మందికి కొత్త కిడ్నీలు అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా ఆర్గాన్ డొనేషన్ జరగడం లేదంటున్నారు. ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రజలలో సరియైన అవగాహన లేకపోవడం, మూడనమ్మకాలు, అమాయకత్వం ప్రజలలో ఉన్నాయట. వాటిని నిర్మూలించి , అవయవదానం గురించి ప్రచారం చేయడం ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావాలని నిపుణుల అభిప్రాయం. ఆర్గాన్ డొనేషన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన వాప్తవాలను నిపుణులు సూచించారు.

-ప్రతి వ్యక్తి తన అవయవాలను దానం చేయడం వలన 50 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు.

-మానవ శరీరంలో ముఖ్యమైన భాగాలను డొనేట్ చేయచ్చు. గుండె, కిడ్నిలు, లివర్ ,ఊపిరితిత్తులు, పాంక్రియాస్, బడ్ల్, బడ్ల్ వెసల్స్ (రక్తనాళాలు) మెదలైనవి.

– అవయవదానం మూడు రకాలు లివింగ్ డొనేషన్, డిసీజ్డ్ డోనేషన్, వాస్కుల్యర్ కంపోజిట్ అలోగ్రాఫ్ట్స్

-అవయవదానం పుట్టిన శిశువు నుంచి 75 సంవత్సరాల వరకు అర్హులే.

-అవయవదానం డాక్టర్ల అనుమతి , ఆయా అవయవాలను వైద్యులు పరీక్షించి బాగున్నాయని నిర్థారించి, సదురు రోగికి ఆ అవయవాలు సరిపోయినప్పుడే వాటిని అమరుస్తారు.

-అవయవదానం చేయాలనుకున్న వారి కోసం ప్రతి రాష్ట్రంలో సంబందిత విభాగాలల్లో తమ పేర్లు ను రిజిస్టర్ చేసుకోవాలి.