aha starting comedy stock exchange
mictv telugu

తిరుగులేని జబర్దస్త్ కి షాక్.. అనిల్ తో ఆహ భారీ స్కెచ్

November 20, 2022

బుల్లితేరపై తిరుగులేని కామెడీ షో జబర్దస్త్. దశాబ్ద కాలంగా దుమ్ములేపుతుంది. టీఆర్పీస్, యూట్యూబ్ వ్యూస్ లో జబర్దస్త్ ని ఇంతవరకు ఏ షో కూడా బీట్ చేయలేకపోయింది. ‘అదిరింది’తో నాగబాబు జబర్దస్త్ ని డెబ్బయడానికి ట్రై చేస్తున్నా.. ఆయన షోకి కావాల్సిన మైలేజ్ రావటం లేదు. అయితే ఇన్నాళ్లకు జబర్దస్త్ కి భారీ షాక్ ఇచ్చే దిశగా ఆహ అడుగులేస్తోంది. జబర్దస్త్ నిర్మాతలు మల్లెమాల కంపెనీ ఎలాగైతే టీవీ ఇండస్ట్రీని శాశిస్తుందో.. సినీ ఇండస్ట్రీని తన కనుసన్నలతో నడిపించే వ్యక్తి అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ సంస్థకి ఇండస్ట్రీలో మరో పోటీ లేదు. అలాంటి అల్లు అరవింద్ ఆహతో ఓటీటీకి సైతం ఎంట్రీ ఇచ్చి విజయవంతంగా దూసుకెళ్తున్నారు. అలాంటి ఆహ కన్ను ఇప్పుడు జబర్దస్త్ మార్కెట్ పై పడింది. యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియో పెడితే మినిమమ్ వన్ మిలియన్ కామన్. దాన్ని గండి కొట్టేందుకు సుడిగాలి సుధీర్ వంటి క్రేజీ స్టార్ తో చేతులు కలిపేసింది ఆహ.

సుధీర్ హోస్ట్ గా అచ్చం జబర్దస్త్ వంటి మరో కామెడీ షో పట్టాలెక్కిస్తుంది ఆహ. దాని పేరు “కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్”. ఈ షోకి జడ్జిగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉండనున్నారు. సుడిగాలి సుదీర్ ,దీపికా పిళ్ళైలు హోస్ట్ లుగా.. అవినాష్, వేణు, సద్దాం, యాదమ్మ రాజు, హరి భాస్కర్, జ్ఞానేశ్వర్ టీం లీడర్స్ గా వ్యవహరించబోతున్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలతో పోల్చితే ఇది కొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇటీవలే “ప్రేక్షకులే ఇన్వెస్ట్మెంట్ కమెడియన్ స్టాక్స్ .. అనిల్ రావిపూడి చైర్మన్”.. అంటూ ఒక ప్రోమోని వదిలారు. ఇందులో టీమ్స్ పర్ఫార్మెన్స్ కి జడ్జీలు కాకుండా జనాలు మార్కులు వేసేలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నారు. చూద్దాం మరి.. ఇప్పటికైతే పట్టిందల్లా బంగారమవుతున్న అల్లు అరవింద్ మల్లెమాల సంస్థకి ఎలాంటి షాక్ లు ఇవ్వనున్నాడో.