శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న నట సింహం బాలకృష్ణకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సర్ప్రైజ్ చేసింది. ఈ సంస్థలో బాలయ్య ఇంతకు ముందు అన్‌స్టాపబుల్ అనే షో చేసిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, వ్యూస్ పరంగా ఈ షో సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ఫైనల్ వేదికగా ఆయన పుట్టినరోజును గ్రాండ్‌గా జరిపింది. ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్‌లు బాలయ్య కళ్లకు గంతలు కట్టి వేదికపైకి తీసుకెళ్లారు. కేకు వరకు తీసుకెళ్లి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా బాలయ్య బాబుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.