గొప్ప శుభవార్త.. కరోనా వాక్సీన్ తయారు చేసిన ఇటలీ..
కరోనా వైరస్‌తో వణుకుతున్న ప్రపంచానికి ఇటలీ శాస్త్రవేత్తలు దారి చూపించారు. కోవిడ్ వ్యాధికి తొలిసారిగా సమర్థమంతమైన టీకాను తయారు చేశారు. రోగి దేహంలో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసి కోవిడ్-19 వైరస్‌ను నిర్మూలించే టీకాను అభివృద్ధి చేసినట్లు టకీస్ కంపెనీ తెలిపింది. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా వైరస్ చచ్చిందని, మనుషుల్లోనూ ఇది పనిచేస్తుందని వెల్లడించింది. ఎలక్ట్రోపరేషన్ అనే విధానంలో వ్యాక్సీన్ కణాల్లోకి వెళ్లి రోగనిరోధకను పెంచి కోవిడ్‌ను చిత్తు చేస్తుందని వివరించింది.
‘రోమ్ నగరంలోని లాజరో స్పాల్లాంజీ అంటువ్యాధుల ఆస్పత్రిలో దీనిపై పరీక్షలు జరిపాం. ఎలుకల్లో మాదిరే ఇది మానక కణాలపైనా చక్కగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచంలో జరుగుతున్న అన్ని పరిశోధనలతో పోలిస్తే ఇదే మెరుగైన ఫలితం…’ అని టకీస్ సీఈఓ లుయిజీ అరిసిచియో తెలిపారు. టీకాను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి అమెరికాకు చెందిన లీనియాఆర్ఎక్స్‌తో కలిసి పనిచేస్తామన్నారు. తాము కూడా పరిశోధనల్లో ముందడుగు వేశామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. చైనా శాస్త్రవేత్తలు కూడా తాము తయారుచేసిన ఔషధాన్ని పందులపై ప్రయోగించగా చక్కని ఫలితాలు వచ్చాయన్నాయి. అయితే ఎలుకతో దగ్గరి పోలికలున్న మానవ దేహవ్యవస్థకు సంబంధించి ఇటలీ పరిశోధనలు ఆసక్తిని, ఆశను కలిగిస్తున్నాయి.