Ahead of PM’s visit to Telangana, ‘Modi No Entry’ flex appears in Hyderabad
mictv telugu

మోదీ తెలంగాణకు రావొద్దంటూ.. ఫ్లెక్సీలతో నిరసనలు

November 10, 2022

Ahead of PM’s visit to Telangana, ‘Modi No Entry’ flex appears in Hyderabad

ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేతపై విధించిన జీఎస్టీ ని వెనక్కి తీసుకున్న తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటూ.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ చేనేత యూత్‌ ఫోర్స్‌ పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘మోదీ నో ఎంట్రీ టూ తెలంగాణ’ అంటూ ఫ్లెక్సీలు చెక్‌పోస్ట్‌తో పాటు పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పర్యటనను అడ్డుకుంటామని, నల్లజెండాలతో నిరసన తెలుపుతామని పలు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

నవంబర్ 12వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)ను జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఇప్పటికే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై ఉత్పత్తి కూడా మొదలయ్యాక ఇప్పుడు దానిని ప్రారంభించడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మోదీ పర్యటనను అడ్డుకుంటామని, ఆందోళనలు చేస్తామంటూ వామపక్ష, విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.