పాకిస్తాన్‌లో సీనియర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లపై ఆ దేశ క్రికెటర్ అహ్మద్ షెజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ దేశంలో జూనియర్లు మెరుగ్గా రాణించి సక్సెస్ అయితే సీనియర్లు తట్టుకోలేరని తెలిపాడు. తనకు పాక్ క్రికెట్‌లో జరిగిన అన్యాయంపై మీడియాతో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘కోహ్లీ రాణించడానికి ధోనీనే కారణం. ధోనీ మద్ధతు ఉండబట్టే కోహ్లీ నిలకడగా, మెరుగ్గా రాణించగలుగుతున్నాడు. అదే పాకిస్తాన్‌లో అయితే ఆ పరిస్థితి లేదు. మేమెవరమైనా మంచిగా ఆడితే తట్టుకోలేరు. విరాట్ కోహ్లీ రెండేళ్లు ఫాంలో లేకపోయినా పర్వాలేదు. అదే నేను రెండు మ్యాచులు ఆడకపోతే జట్టులోంచి తీసేశారు. దేశవాళీ మ్యాచుల్లో ఆడి అత్యధిక పరుగులు చేసినా దేశం తరపున ఆడడానికి అవకాశం ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.