కారుపై కూర్చుందని కుక్క ప్రాణం తీశాడు..
అసలే లాక్‌డౌన్.. ఆపై నిత్యావసరాలకు కటకట. మూగజీవాలు తిండికి దొరక్క అల్లాడుతున్నాయి. కొందరు ధర్మాత్ములు వాటికి తిండిపెట్టి ప్రాణాలు నిలపుతున్నారు. మరోపక్క.. తన కారుపై కుక్క కూర్చోడాన్ని జీర్ణించుకోలోక వ్యక్తి దాన్ని తుపాకీతో దారుణంగా కాల్చిచంపేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం రాత్రి ఘాతుకం జరిగింది.
రాణిప్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంటులో నివసిస్తున్న జిగర్ పంచాల్ తన కారులో లోపల కాకుండా బయటపెట్టకున్నాడు. దానిపై ‘కూర్చోవడం నేరం’ అని తెలియని వీధికుక్క సేదతీరడానికి కూర్చుండిపోయింది. గోళ్ల గీతలు కూడా కొద్దిగా పడ్డాయి. మిగతా కుక్కలు కూడా కింద కూర్చుని నిద్రపోయాయి. ఇది చూసిన జుగర్ పిచ్చికుక్కలా రెచ్చిపోయాడు. ఇంట్లోంచి ఎయిర్ గన్ తీసుకొచ్చి కాల్పులు జరిపారు. స్థానికులు అడ్డుకోవడంతో ఇంట్లోకి వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ కాల్పులు వినిపించాయి. స్థానికులు వెళ్లి చూడగా కారు పక్కన ఓ కుక్క నిర్జీవంగా కనిపించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి జంతుహింస కింద కేసుపెట్టారు.