వరద బాధితులకు అప్పిరెడ్డి ఆపన్నహస్తం
వరదల్లో సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీతోపాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కొన్ని నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని కృష్ణపట్టె తీర ప్రాంతమైన గంగా భవానీపురానికి చెందిన జాలర్లు వరదల కారణంగా జీవనోపాధి కోల్పోయారు. వారి పరిస్థితిని గమనించిన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి చలించిపోయారు.
ఆయన ఈ రోజు బాధితులను స్వయంగా పరామర్శించి, 40 కుటుంబాలకు బియ్యం అందజేశారు. వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండపనేని చక్రధర్, ఎంపీపీ గోపాల్ , బిడ్డతండ సర్పంచ్ మోతిలాల్ నాయక్ ,నాయకులు నీమా నాయక్ పోక బత్తిని రాజేష్ గడ్డం సైదులు తదితరులు పాల్గొన్నారు. ఏహెచ్ఆర్ ఫౌండేషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతోపాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.